నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంపై ఫైర్ అయ్యారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందన్నారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని పేర్కొంటూ జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.