నిజామాబాద్: ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోళీ జరుపుకోవాలి: సీపీ

77చూసినవారు
నిజామాబాద్: ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోళీ జరుపుకోవాలి: సీపీ
ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోళీ పండగను జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ప్రజలను కోరారు. గురువారం ఆయన తన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. స్నేహ పూర్వక వాతావరణంలో పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా రంగులు చల్లరాదని, అవాంచనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు.