నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ చౌరస్తాలో ఇద్దరిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డ మోపాల్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన ఆకుల నరసింహను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ బి. రఘుపతి తెలిపారు. నరసింహ మేకల లాలయ్య అనే మేస్త్రీ వద్ద రూ. 500తో పాటు మరో మహిళ వద్ద రూ. 1000 లాక్కుని పడేశాడని సీఐ వివరించారు.