నిజామాబాద్: అధికారిని కలిసిన పద్మశాలి సంఘం నాయకులు

85చూసినవారు
నిజామాబాద్: అధికారిని కలిసిన పద్మశాలి సంఘం నాయకులు
ఆర్‌,బీఇఇగా ప్రమోషన్ వచ్చిన నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీమన్నారాయణను నగర పద్మశాలీ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి మంగళవారం అభినందించారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఎనగందుల మురళి, జిడ్డు సత్యపాల్, పెంటి దేవిదాస్, చిలుక కిషన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్