ఎల్ ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సరైన పత్రాలు సమర్పించి ప్లాట్లను రెగ్యులర్ చేసుకోవాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశ వేణు సూచించారు. ఎల్ ఆర్ఎస్ కోసం నుడా పరిధిలో 5,969 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో4,511 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.