మధ్యాహ్న భోజన పథకానికి రూ. 250 కోట్లు నిధులు కేటాయించాలని ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి ఆధ్వర్యంలో పథకం స్థితిగతులపై అధ్యయనం చేసి రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజన పథకానికి 250 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.