నిజామాబాద్‌లోని సీఐటీయు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ జులై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు.