నిజామాబాద్: ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థి (14) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం వాస్తవాలను దాచిపెడుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కొడుకు చనిపోవడానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.