అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఎడ్ల నాగరాజు అన్నారు. మంగళవారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడారు. మాల జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, ఉద్యోగుల అధ్యక్షులు అలుక కిషన్ లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా వీరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.