నిజామాబాద్‌: సమాజాన్ని జాగృతం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశం

68చూసినవారు
నిజామాబాద్‌: సమాజాన్ని జాగృతం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశం
నిజామాబాద్‌: ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి సమాజాన్ని జాగృతం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశమని హిందూ జాగరణ మంచ్‌ అఖిల భారత సంఘటన మంత్రి పెనుబల్లి దేవేందర్‌రెడ్డి అన్నారు. ఇందూరు నగరంలోని ఓ పాఠశాలలో శనివారం ఆర్‌ఎస్‌ఎస్‌ విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత 99 సంవత్సరాలుగా సమాజ హితం కోసం తిరస్కారాలను, అణచివేతలను ఎదుర్కొని నిలబడిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్