ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సారంగాపూర్ సురభి గోశాల సమీపంలో ఉన్న గుట్టపైన బాలా హనుమాన్ విగ్రహానికి మంగళవారం ప్రాణ ప్రతిష్ట జరిపారు. ప్రత్యేక పూజలు చేసి అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ సభ్యులు సాయిరాం, పల్లపు అంజి, మహేష్, నాగరాజు, రాజు, గ్రామ పెద్దలు శ్రీనివాస్ గౌడ్, నాగేష్, రవి, మోహన్, శ్రీను, నాగరాజు, గో సేవకులు దాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.