నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ అమరవీరుల స్థూపం వద్ద సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్టు విరిగి కారు మీద పడింది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా పెద్ద వృక్షం కూలిపోయి, అక్కడే నిలిపిన కారు ధ్వంసమైంది. అనంతరం చెట్టును అధికారులు తొలగించారు.