తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీకి తెలంగాణ పేరును అలాగే ఉంచాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ద్వారా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ప్రిన్స్, దేవిక, రవీందర్, రాకేష్, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.