నిజామాబాద్ లోని వెల్ నెస్ సెంటర్ కు చికిత్స చేయాలని ఆల్ పెన్షనర్స్ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కే. రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ కు అదనపు గదులు కేటాయించి అన్ని సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.