ఎస్సీ వర్గీకరణను ఒప్పుకునేది లేదని, దీనిని అడ్డుకునేందుకు మాలలందరూ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని మాల మహానాడు జాతీయ కన్వీనర్ చెన్నయ్య పిలుపునిచ్చారు. మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ కు వచ్చారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గైని గంగారం, ఎడ్ల నాగరాజు, ఎల్లయ్య స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.