

విమాన ప్రమాదం.. మృతులను గుర్తించేందుకు DNA టెస్టులు (VIDEO)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల శవాలు గుర్తించడం అత్యంత క్లిష్టంగా మారింది. ప్రమాద సమయంలో జరిగిన భారీ పేలుళ్ల కారణంగా చాలా మంది సజీవదహనం అయ్యారు. మాంసపు ముద్దలు మాత్రమే లభ్యమయ్యాయి. దీంతో మృతుల గుర్తింపునకు DNA పరీక్షలు చేపట్టారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్షలు జరుగుతున్నాయి. డీఎన్ఏ ఫలితాల ఆధారంగా మృతులను గుర్తించి, కుటుంబాలకు అప్పగించనున్నారు. పోలీసులు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.