దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం ఇద్దరు తెలుగోళ్లను పాకిస్థాన్ పౌరుడు అతి కిరాతకంగా నరికి చంపాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయిలోని ఓ పేరొందిన బేకరీలో పనిచేస్తున్నారు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలుస్తోంది.