ఏపీలో ప్రారంభమైన తక్కువ ధర లిక్కర్ సేల్స్
AP: రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.99 నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి చీప్ లిక్కర్ అందుబాటులోకి రావడంతో మందుబాబుల్లో హుషారు మరింత పెరిగిపోయింది. షార్ట్స్ పేరుతో బ్రాందీ, విస్కీ అమ్మకాలు ప్రారంభం కాగా, పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులోకి వచ్చేవరకు లిమిటెడ్ స్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.