నిజామాబాద్ నగరంలోని కొన్ని చోట్ల శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్-1, 2 ఏడీలు ఆర్ చంద్రశేఖర్, ఆర్ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలో మూడవ శనివారం సబ్ స్టేషన్ ల నిర్వహణ కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.