

పీఎస్ఎల్వీ-సి61 రాకెట్ దారి తప్పిందా? (వీడియో)
ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సి 61 రాకెట్ ఆదివారం ఉదయం 5.59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి, రెండు దశలు దాటి మూడో దశలోకి అడుగుపెట్టింది. కాసేపటి తర్వాత పీఎస్ఎల్వీ- సి 61 ప్రయోగంలో సాంకేతి సమస్య ఎదురైంది. దీంతో రాకెట్ వెళ్లాల్సిన మార్గం దారితప్పినట్లు తెలుస్తోంది. ‘పీఎస్ఎల్వీ ప్రయోగం పూర్తికాలేదు. విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.