నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (DM&HO)గా డాక్టర్ రాజశ్రీ నియమితులయ్యారు. కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖను అన్ని విధాలుగా ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పని చేస్తామన్నారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.