మున్సిపల్ కార్మికులకు వర్షాలకు పనిముట్లు ఇవ్వాలని వినతి

58చూసినవారు
మున్సిపల్ కార్మికులకు వర్షాలకు పనిముట్లు ఇవ్వాలని వినతి
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల బాధ్యులు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులతో ఆదివారం, పండగ సెలవులు కూడా ఇవ్వకుండా పనిచేయిస్తున్నారన్నారు. కార్మికులకు పనిముట్లు, రైన్ కోట్లు గ్లౌజులు, బూట్లు ఇవ్వలేదన్నారు.