ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన ఇన్చార్జి మంత్రిగా సీతక్కని నియమిస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు అన్న ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా నియమించారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.