నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయనను గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 3. 30 గంటలకు మృతిచెందారు. ఆయన మృతి పట్ల జిల్లా జర్నలిస్ట్ సంఘాలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.