నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని నిజామాబాద్ బస్టాండ్ వద్ద చెవుల్లో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాస్ చార్జీలను అమాంతం 20 శాతానికి పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే పెంచిన వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు.