నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి : కలెక్టర్

64చూసినవారు
నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి : కలెక్టర్
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామంలో గల నర్సరీని గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ ఈ. ఈ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్