
పెళ్లైన వారానికే.. నవ వధువును చంపిన వరుడు
పెళ్లైన వారానికే నవ వధువును వరుడు చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చోెటు చేసుకుంది. రాజు పాల్(44) అనే వ్యక్తికి గతంలో రెండు వివాహాలు అయ్యాయి. మే 9న ఆస్తి పాల్(24)ను మూడో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన వారానికే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలో ఆర్తిని రాజు తీవ్రంగా కొట్టాడు. పోలీసులు ఆర్తిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించి మరణించిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.