ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ లోని కోటగల్లిలోని ఎన్. ఆర్ భవన్ లో టీయూసీఐ రాష్ట్ర కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వమహాసభ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. 21న రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ర్యాలీ నిర్వహించి, పాత కలెక్టర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 22న నేలకల్ రోడ్డులో గల ఆర్. ఎన్ కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు.