కులగణనలో సర్వేలో ఆస్తుల వివరాలెందుకు - అర్బన్ ఎమ్మెల్యే

54చూసినవారు
కులగణనలో సర్వేలో ఆస్తుల వివరాలెందుకు - అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కులగణనలో సర్వేలో ఆస్తుల వివరాలెందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్వే కూడా వివిధ పథకాల్లో కోతలు పెట్టేందుకే అనే అనుమానం వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆస్తులు, జీత భత్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్