నిజామాబాద్: లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో రూ. 41,75,500ల సిఎం సహాయ నిధి చెక్కులను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు, సీఎం సహాయ నిధిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.