సదాశివనగర్ మండలం భూంపల్లిలో విషజ్వరంతో 4వ తరగతి చదువుతున్న ఊరడి రంజిత్(9) అనే బాలుడు మృతి చెందాడు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న రంజిత్ ను గురువారం మధ్యాహ్నం గాంధారి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. గ్రామంలో వారం రోజులుగా విష జ్వరాలతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.