ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక శ్రద్ధతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 15 లక్షలతో మల్లాయిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమైననట్లు ఆ పార్టీ నేతలు వివరించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ రజిత కలిసి బుధవారం పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మెన్ వెంకట్ రాంరెడ్డి పాల్గొన్నారు.