స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టి, సెగ్మెంట్లోని అన్ని స్థానాల్లో గెలిచి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అబ్జర్వర్లు వేణు గోపాల్, సత్యనారాయణ గౌడ్, అలాగే కామరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.