పాల్వంచ: పిడుగు పడి గొర్రెల కాపరి మృతి.. మరొకరికి గాయాలు

50చూసినవారు
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన మధురై సురేష్ శనివారం పిడుగు పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన మధిర సురేష్, మహేష్ వాడి గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా పిడుగు పడి సురేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరో యువకుడు మహేష్ కు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో వెంటనే మహేష్ ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్