ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట మండలం శివయ్యపల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి విద్యుత్ఘాతానికి తండ్రి మృతి చెందినట్లు ఎస్ ఐ. పుష్పరాజ్ తెలిపారు. మంగళవారం ఎస్ఐ మాట్లాడుతూ. గజ్జెల వెంకటి(57)అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.