కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ వాగు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగు వద్ద ఓ మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి వయసు దాదాపు 45 ఏళ్లు ఉండవచ్చని.. అతని చేతి పైన ఉన్న పచ్చబొట్టు తమిళంలో ఉండగా.. తెలుగులో అనువదించగా వాసుమి అనే పేరుతో ఉందన్నారు. ఎవరైనా మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.