టీజీఐఐసీకి ఎలాంటి మార్టిగేజ్ రుణం ఇవ్వలేదని ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. టీజీఐఐసీ తమ వద్ద ఏ భూములనూ మార్టిగేజ్ చేయలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది. కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీజీఐఐసీకి అకౌంట్ బ్యాంకుగా మాత్రమే వ్యవహరించామని ప్రకటించింది.