కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో ఎలాంటి మార్పు లేదని, POKను పాకిస్తాన్ ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. అలాగే కాల్పుల విరమణ కోరింది కూడా పాక్ అని పేర్కొన్నారు. ఈ సమస్యలను ద్వైపాక్షికం గానే పరిష్కరించుకుంటామని తెలిపారు.