TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీ పై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ నేత చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదని అన్నారు. ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.