నీ డెడ్‌లైన్ కోసం ఇక్కడ ఎవరు ఎదురుచూడటం లేదు: సీతక్క (VIDEO)

56చూసినవారు
కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ విసిరారు. డెడ్ అయిన పార్టీ డెడ్‌లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ డెడ్‌లైన్ కోసం ఇక్కడ ఎవరు ఎదురుచూడటం లేదన్నారు. 'సీఎం విసిరిన సవాల్ KTRకు అర్దం కానట్లు ఉంది. విదేశాలలో ఉన్న KTR ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏంటి? ప్రతిపక్ష హోదా ఉన్న మీ నాన్నను అసెంబ్లీకి రమ్మను చర్చిస్తాం' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్