ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా విషయం తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా బీజేపీ అక్కడ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయాన్ని కూడా ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. దీనిపై ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలో ఎవరికీ ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ ఎద్దేవా చేశారు.