నా కోసం ఎవరూ అలాంటి పని చేయొద్దు: ఎన్టీఆర్

68చూసినవారు
నా కోసం ఎవరూ అలాంటి పని చేయొద్దు: ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎవరూ తనకోసం పాదయాత్ర చేయొద్దని, తానే ఓ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ కలుస్తానని అన్నారు. దీనికి కొంత సమయం పడుతుందని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్