రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని దానికి స్వస్తి పలికి శాంతి చర్చలు జరపాలని పుతిన్ కు సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ తో మోదీ చర్చలు జరిపారు. భావి తరాల భవిష్యత్తుకై ఇరు దేశాల మధ్య శాంతి అవసరమని నొక్కి చెప్పారు. శాంతి పునరుద్ధరణకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.