రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం శ్రీనగర్‌లో సైనిక బలగాలను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..“ఇంత విపరీతమైన పరిస్థితుల్లో మీ మధ్య ఉండడం నాకు గర్వంగా ఉంది. #ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మీరు చేసిన సేవలు దేశం మొత్తం గర్విస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మీరు అందించిన సేవలు అభినందనీయం. అణు బెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదుల దుశ్చర్యలకు తగిన గుణపాఠం చెప్పింది’’ అని ఆయన తెలిపారు.