తనను ఎవరూ కొట్టలేదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో కలెక్టర్ మాట్లాడారు. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు.