తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 3 గంటలు పడుతోంది. ప్రస్తుతం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం స్వామి వారిని దాదాపు 74,477 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,294 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.84 కోట్లుగా నమోదైంది. ఈ భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మే 15 నుంచి వీవైపీ సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం ప్రకటించిన సంగతి తెలిసిందే.