చైనా మాంజాతో ముక్కు కట్.. యాజమాన్యంపై ఫిర్యాదు

56చూసినవారు
చైనా మాంజాతో ముక్కు కట్.. యాజమాన్యంపై ఫిర్యాదు
మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని భోగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చైనా మాంజాతో ఓ వ్యక్తి ముక్కు కట్ అయ్యింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి వేడుకల సందర్భంగా పతంగులు ఎగరవేయమని స్కూల్ యాజమాన్యం చైనా మాంజాను ఇచ్చింది. అయితే అదే సమయంలో పొలం నుంచి తిరిగి వస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి మాంజా తగిలి ముక్కు కట్ అయి మూడు కుట్లు పడ్డాయి. దీంతో స్కూల్ యాజమాన్యంపై బాధితుడు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్