లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని బుట్టాయిగూడెంకు చెందిన నాగయ్య గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాగయ్య కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న రేవంత్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం అని హరీష్ పేర్కొన్నారు.