హైదరాబాద్ నగరం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30శాతం కూడా కులగణన సర్వే చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారని.. కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదని అన్నారు. ఫార్మాట్ మార్చి మళ్లీ కులగణన సర్వే చేయించాలని.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలని తలసాని డిమాండ్ చేశారు.