మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి: సీతక్క

81చూసినవారు
మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి: సీతక్క
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాన్ని చాటుకున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మా నోళ్లను పినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్. పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్‌తో కడగాలి. పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయిపోయింది' అంటూ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్